పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 మంది బాధితులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 మంది బాధితులు

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

పోలీస

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 మంది బాధితులు

జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది అర్జీలు సమర్పించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన ఎస్పీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

‘సీపీఎస్‌’ బకాయిలు చెల్లించండి

జగిత్యాలరూరల్‌: సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు విడుదల చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గంగధరి మహేశ్‌ అన్నారు. కంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ పిలుపు మేరకు సారంగాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయి రూ.1200 కోట్లకు చేరిందన్నారు. ఉపాధ్యాయులు ప్రసాద్‌, శంకర్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, ఉమేశ్‌, మురళీ, రాజు, శ్రావణ్‌, నవీన్‌, వసంత, రేఖ, హేమలత, శ్రీలత, వాసవి పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన అవసరం

జగిత్యాల: సీపీఆర్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రథమ చికిత్స చేయవచ్చని, తద్వారా ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. వైద్యులు లవకుమార్‌, కో–ఆర్డినేటర్‌ మురళీ, శ్యామ్‌ పాల్గొన్నారు.

చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వండి

జగిత్యాలటౌన్‌: మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసే బదులు చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు అందించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సీఎంకు లేఖ రాశారు. సకాలంలో చేప పిల్లల పంపిణీ చేపట్టకపోవడం.. పరిమాణం చిన్నగా ఉండడంతో ఆశించిన స్థాయిలో ఎదగలేదని, మత్స్యకారులు ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీ ఆగస్టు, సెప్టెంబర్‌ వరకే పూర్తి చేయాల్సి ఉంటుందని, జిల్లాలో మొత్తం 756 చెరువులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 154 చెరువుల్లో మాత్రమే పిల్లలు వదిలారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ చేపట్టాలని కోరారు.

విద్యార్థులకు తెలుగు ప్రతిభా పరీక్ష

మల్యాల: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి కాంప్లెక్స్‌ పరిధిలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. విజేతలు విక్కి, సాత్విక్‌ రెడ్డి, ఎల్‌.శ్లోక, పి.మోక్షకు డీఈవో రాము బహుమతులు అందించారు. ఏఎంఓ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంఈఓ జయసింహారావు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు  14 మంది బాధితులు1
1/2

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 మంది బాధితులు

పోలీస్‌ గ్రీవెన్స్‌కు  14 మంది బాధితులు2
2/2

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14 మంది బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement