ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగా యి. 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా జనరల్ కోర్సులకు 5,927 మందికి గాను 5,832 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 839కి 801 మంది పరీక్షలు రాశారు. అదనపు కలెక్టర్ లత జిల్లాలోని కోరుట్ల, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం కేంద్రాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలకు పటిష్ట భద్రత
జగిత్యాలరూరల్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంలో పోలీసు శాఖ సహకరిస్తుందన్నారు. పరీక్ష విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్షల పరిశీలన
రాయికల్: రాయికల్ ఉర్దూమీడియం ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్ష నిర్వహణ, ఉపాధ్యాయుల బోధనను గురువారం డీఈవో రాము పరిశీలించారు. వివిధ అంశాలపై విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి నీరజ, ఎంఈవో రాఘవులు, ప్రధానోపాధ్యాయులు నజియ, పరిశీలకులు కడకుంట్ల అభయ్‌రాజ్, ఉపాధ్యాయులు మతిహ తబుస్సం, ఫీల్డ్ ఇన్వెిస్టిగేటర్ తషిఫ అర్ఫిన్ పాల్గొన్నారు.
రేపు ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఉపాధి కల్ప నాధికారి కార్యాలయంలో ఈనెల 28న ఉచిత ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బింగి సత్యమ్మ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఎంప్లాయీమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
డిజిటల్ హెల్త్ కార్డులపై అపోహలొద్దు
జగిత్యాల: డిజిటల్ హెల్త్‌కార్డులపై అపోహలొద్దని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఓల్డ్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సావిత్రి మోహన్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. హెల్త్‌కార్డుల నిర్వహణ ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉంటుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులందరికీ ఈస్కీం వర్తిస్తుందన్నారు. పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, డీఈవో రాము, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, హెచ్‌ఎం చంద్రకళ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌రావు, అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు నరహరి, లక్ష్మారెడ్డి, సుజాత, శ్రీనివాస్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం


