రైతులెవరూ అధైర్యపడొద్దు
రాయికల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, రైతులెవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం రాయికల్ మండలం రామాజీపేటలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. 650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసా య, రెవెన్యూ అధికారులతో నివేదికలు అంచనా వే యించి రెండు రోజుల క్రితమే సీఎంతో మాట్లాడి స మస్య వివరించామన్నారు. త్వరితగతిన నష్టపరిహా రం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బెజ్జంకి మోహన్, మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, నాయకులు కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, సురేందర్‌నాయక్, ఉప సర్పంచ్ సుధీర్, నారాయణ, భరత్, విజయ్, నర్సారెడ్డి, బేతి మోహ న్‌రెడ్డి, మల్లారెడ్డి, ఏవో ముక్తేశ్వర్ పాల్గొన్నారు.
పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలి
జగిత్యాల: తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, విద్యతో పాటు క్రీడలు చాలా అవసరమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని ఈశా, గౌతమ్ స్కూల్‌లో జరిగిన పవర్‌ప్లే 2026 స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్నా రు. క్రీడలు మానసిక ఉల్లాసం, ప్రశాంతత కల్పిస్తాయని, పోటీతత్వం పెంపొందిస్తుందని అన్నారు. విద్యాధికారి రాము, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సుధీర్, పాఠశాల కరస్పాండెంట్ కంది అన్నపూర్ణ, డైరెక్టర్ శరత్, కై లాసం, విద్యార్థులు పాల్గొన్నారు.


