ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు

Feb 28 2026 7:18 AM | Updated on Feb 28 2026 7:18 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు

జగిత్యాల: జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా జరిగాయి. జనరల్‌ కోర్సులకు సంబంధించి 6,750 మందికి గానూ 6,614 మంది విద్యార్థులు హాజరు కాగా 136 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో 1,142 మందికి 1,057 మంది హాజరు కాగా, 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ లత తనిఖీ చేశారు. ఎలాంటి మాల్‌ప్రాక్టిస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులుంటే టెలిమానస్‌కు 14416 ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు.

ఆయిల్‌పాం లాభాలపై రైతులకు వివరించాలి

మల్యాల(చొప్పదండి): రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మళ్లేందుకు సర్పంచులు కృషి చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంప్రసాద్‌ కోరారు. శుక్రవారం న్యాక్‌ కేంద్రంలో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్‌ మండలాల సర్పంచులకు శిక్షణలో భాగంగా ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించారు. రైతులకు ఆయిల్‌పాం సాగుతో కలిగే లాభాలు వివరిస్తూ, పంట సాగువైపు మళ్లించాలని సూచించారు. ఆయిల్‌పాం సాగుకు కోతులు, వన్యప్రాణుల బెడద ఉండదన్నారు. ఎంపీడీవో చిరంజీవి, ఉద్యానవన శాఖ ఏఈవో అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

1న ప్రవేశ పరీక్ష

జగిత్యాల: ఐదునెలల ఫౌండేషన్‌ కోర్సు ఉచిత శిక్షణకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌ తెలిపారు. ప్రవేశ పరీక్షలో ఎంపికై నవారికి వసతి, భోజన సౌకర్యాలతో పాటు స్టడీ మెటిరియల్స్‌ అందిస్తారని పేర్కొన్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారని, స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

రాష్ట్ర అధ్యక్షున్ని కలిసిన బీజేపీ కౌన్సిలర్లు

రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ బల్దియాలో బీజేపీ కౌన్సిలర్లుగా కూనారపు మానస, తోపారపు ప్రశాంతి, పుర్రె శ్రీధర్‌, వేముల మౌనిక ఇటీవల గెలుపొందగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హైదరాబాద్‌లో కలిశారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు మున్సిపల్‌ సమావేశం

జగిత్యాల: ఇటీవల నూతనంగా ఎంపికై న మున్సిపల్‌ కార్యవర్గం శనివారం సమావేశం కానుంది. జగిత్యాలలో స్పెషల్‌ ఆఫీసర్‌ కాలంలో అనేక అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంతో పాటు, పాలకవర్గం లేక అనేక సమస్యలు పేరుకుపోయాయి. శానిటేషన్‌ అస్తవ్యస్తంగా మారడంతో పాటు, ఇంటి అనుమతుల్లో జాప్యం, బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం, అభివృద్ధి పనులు నత్తనడక సాగడం లాంటి అనేక సమస్యలున్నాయి. మొదటిసారి సమావేశమవుతున్న మున్సిపల్‌ కార్యవర్గం సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇంటర్‌ పరీక్షలకు  221 మంది గైర్హాజరు1
1/2

ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు

ఇంటర్‌ పరీక్షలకు  221 మంది గైర్హాజరు2
2/2

ఇంటర్‌ పరీక్షలకు 221 మంది గైర్హాజరు

Advertisement
 
Advertisement
Advertisement