అప్పు తీర్చాల్సిందే..
జగిత్యాల: మహిళలు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందజేస్తుంది. ఈ రుణాల ద్వారా మహిళ సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో కొందరు సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలు నాన్ పర్ఫార్మ్ అసెట్‌లోకి పోతున్నాయి. దీంతో సక్రమంగా కట్టిన మహిళలకు సైతం రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మహిళా సంఘాల్లో రుణం ఎత్తుకున్న సభ్యుల్లో ఒక్కరు కట్టకున్నా ఇతరులకు రుణాలు అందేవి కావు. సీ్త్రనిధి అధికారులు కొంత వెలుసుబాటు కల్పించినా కొందరు సభ్యులు చెల్లించడం లేదు. దీంతో మొండిబకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులు జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా, ఇందులో దాదాపు రూ.8 కోట్లకు పైగా మొండి బకాయిలున్నాయి. ఇవి చాలా రోజులుగా పెండింగ్‌లో ఉండటంతో వాటిని వసూలు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లక్ష్యం రూ.110 కోట్లు
సీ్త్రనిధి రుణాలు ఈ సంవత్సరం రూ.110 కోట్లు అందజేయాల్సి ఉండగా, ఫైనాన్స్ ఇయర్ ముగుస్తున్న సమయానికి రూ.15 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కొంత మంది తీసుకున్న రుణాలు కట్టకపోవడం వల్ల మొండి బకా యిలతో రుణా ల పంపిణీ లక్ష్యం పూర్తి కా వడం లేదు. అయి తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణాలు కట్టించాలన్న ఉద్దేశంతో ఆర్‌ఆర్ యాక్ట్‌ను ప్రయోగిస్తోంది. మరో నెలలో ఆర్థిక సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో మళ్లీ సంవత్సరం టార్గెట్ రానుంది. ఈ నెలలోపు రూ.15 కోట్లు పంపిణీ చేసేలా చూస్తున్నారు.
ముందుగా అవగాహన
సీ్త్రనిధి రుణాలు తీసుకుని చెల్లించని మహిళ సంఘాలతో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తారు. బకాయిలు చెల్లిస్తే మరింత రుణాలు పొందవచ్చని, వాటి ద్వారా సాధికారత సాధించవచ్చని సీ్త్రనిధి బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. మహిళ సంఘాల్లో గ్రూపులతో పాటు, ఒక్క మహిళకు సైతం రుణాలు అందించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రుణాలు తీసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. మొండి బకాయిలు వసూలు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ రికవరీ చట్టంతో భూములు, ఇళ్లు జప్తు చేసే అవకాశం ఉంది. దీంతో మహిళలు ఇప్పటికై నా రుణాలు చెల్లిస్తే మళ్లీ పొంది ముందుకెళ్లే అవకాశం ఉంది. లేకుంటే ఆస్తులను జప్తు చేస్తారు.
సెర్ప్ ఆధ్వర్యంలో..
మహిళా సంఘాలు : 14,935
సభ్యులు : 1,77,613
సీ్త్రనిధి రుణాల లక్ష్యం : రూ.110 కోట్లు
పంపిణీ చేసిన రుణాలు : రూ.95 కోట్లు
ఇవ్వాల్సిన రుణాలు : రూ.15 కోట్లు
పెండింగ్ బకాయిలు : రూ.18 కోట్లకు పైగా
చేతివాటం
మెప్మా ఆధ్వర్యంలో..
మహిళా సంఘాలు : 5,400
సభ్యులు : 64,200
కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో సీ్త్రనిధి రుణాలు ఎత్తుకున్న మహిళలు సంబంధిత ఆర్పీలు, వీవోలకు డబ్బు చెల్లిస్తున్నారు. కానీ, వారు బ్యాంక్‌లో కట్టకపోవడంతో పెండింగ్ చూపిస్తున్నాయి. గతంలో రాయికల్, మెట్‌పల్లి, జగిత్యాలలో సొంతానికి వాడుకున్నట్లు బయపడిన విషయం తెలిసిందే. కొంత మందిని సస్పెండ్ చేయగా, మరికొందరిపై రికవరీ పెట్టారు. రుణాలు తీసుకున్న సభ్యులు సంబంధిత సంఘాల అధ్యక్షులకు డబ్బు అందజేస్తున్నారు. వారు బ్యాంకులో చెల్లించకపోవడంతో వివాదాలకు దారితీస్తోంది.
బకాయిల వసూళ్లకు చర్యలు
సీ్త్రనిధి రుణాల బకాయిలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. మహిళ సంఘాల సభ్యులు రుణాలను సకాలంలో చెల్లిస్తే మళ్లీ అందించడం జరుగుతుంది. బకాయిలు చెల్లించకుంటే కొత్త రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. మహిళలు ఇప్పటికై నా గడువులోగా రుణాలు చెల్లించాలి. లేకుంటే రికవరీ యాక్ట్ ప్రయోగించాల్సి వస్తుంది.
– రామ్‌నారాయణ, ఆర్‌ఎం
అప్పు తీర్చాల్సిందే..


