అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు గుర్తింపు
మెట్‌పల్లి/కోరుట్లరూరల్: అంకితభావంతో పని చేసే ఉద్యోగులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మోహన్ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, కమిషనర్‌గా మోహన్ అందించిన సేవలను అభినందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, డీఎస్పీ రాములు, డీఆర్‌డీఏ పీడీ రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కల్లూర్ శివారులో గల కస్తూరిబా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్‌ను పరిశీలించారు. హాస్టల్‌లోని సదుపాయాలు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంఈవో నరేశం తదితరులు పల్గొన్నారు.


