గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
రాయికల్(జగిత్యాల): గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సర్పంచ్ అంజగౌడ్, ఉపసర్పంచ్ చాంద్‌పాషా, ఎంపీడీవో చిరంజీవి, సీడీపీవో మమత, ఎంపీవో సుష్మ, ఏఈ ప్రసాద్, నాయకులు తంగెళ్ల రమేశ్, తిరుపతిగౌడ్, ముకీద్, మమత, ఆదిరెడ్డి, వెంకన్న, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


