ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం మూడోరోజుకు చేరాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించి అనంతరం దేవాలయాల్లో మొక్కులు చెల్లించారు. భక్తులకు నీడ, నీటివసతి, సరిపడా ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. భక్తులు నృసింహునికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కొబ్బరి బెల్లాలు సమర్పించారు.
కాముని దహనం
రాయికల్/మల్లాపూర్: రాయికల్‌లో సోమవారం రాత్రి కాము ని దహనం చేశారు. దహనం మరుసటి రోజు హోలి జరుపుకొంటారు. మల్లాపూర్‌లో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, వార్డుసభ్యులు, వీడీసీ చైర్మన్ సంగ గంగరాజం, అర్చకులు ప్రభాకర్‌శర్మ పాల్గొన్నారు.


