విన్నపాలు వినవలె.. | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె..

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. 62 దరఖాస్తులు రాగా పరిశీలించిన ఆయన పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్‌, జీవాకర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

‘బెస్ట్‌’లో ప్రవేశాలు కల్పించండి

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో బెస్ట్‌ అవైలెబుల్‌ స్కూల్‌ పథకం కింద ఎస్సీ విద్యార్థులకు సీట్లు కల్పించండి. గౌతమ మోడల్‌ స్కూల్‌, మానస, జ్యోతి, అల్ఫోర్స్‌, శ్రీచైతన్య, ఆక్స్‌ఫర్డ్‌, ఏస్‌ టెక్నోలో ప్రవేశాలు కల్పించి మెరుగైన విద్య అందేలా చూడండి.

– ఎమ్మార్పీఎస్‌ నాయకులు

పరిహారం ఇప్పించండి

మాది జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట. గ్రామ శివారులోని సర్వే 542, 547/అ లో ఉన్న భూమి మా తండ్రి, స్వర్గీయ పోగుల మల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చింది. ఇద్దరం సాగుచేసుకుంటున్నం. ఆ భూమిని జాతీయ రహదారి నిర్మా ణం కోసం సేకరించారు. మాకు రావాల్సిన పరిహా రాన్ని ఇతర వ్యక్తుల పేరిట నమోదు చేసిన ట్లు తెలి సింది. మోఖాపై విచారణ జరిపి న్యా యం చేయండి.

– పోగుల రాజన్న, వెంకన్న, అంబారిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement