ధర్మపురి: ధర్మపురిలో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కళాశాలకు అనువైన స్థలం కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జూనియర్ కళాశాల మైదా నంలో పరిశీలించారు. సమీప విద్యార్థులు డిగ్రీ చదువు కో సం దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే మానేస్తున్నారని, అందుకే డిగ్రీ కళాశాల మంజూరు చేయించానని తెలిపారు. 2027 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. బీఏ, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ లైఫ్‌సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో తెస్తామన్నారు. ధర్మపురికి బస్‌డిపో, రెవెన్యూ సబ్ డివి జన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వంటి హామీలు త్వరలోనే నెరవేరుస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, రాజు, నాయకులు దినేష్, జిల్లా అధికారులు తదితరులున్నారు.


