మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో ఇటీవల ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయండి. ప్రమాదంలో చనిపోయిన గంగు, వైష్ణవి, సంపంగి సాయమ్మ, మంగళారపు లలిత కుటుంబాలు కూలి చేసుకుని బతికేవి. ప్రమాదం జరిగి ఆ కుటుంబాలు మరింత ఇబ్బంది పడుతున్నాయి.
– మొగిలిపేట గ్రామస్తులు, మల్లాపూర్
హద్దులు ఏర్పాటు చేయండి
నాకు రాపల్లి శివారు సర్వేనంబర్ 147/1లో 11గుంటల భూమి ఉంది. ఆ భూమికి హద్దులు చెరిపేస్తూ కొందరు కబ్జా చేస్తున్నారు. హద్దులు ఏర్పాటు చేయాలని గొల్లపల్లి తహసీల్దార్‌ను సంప్రదించగా.. ఏవో కారణాలు చూపుతున్నారు. భూమి లేకుంటే జీవనాధారం కోల్పోతాను. భూమికి హద్దులు ఏర్పాటు చేసి న్యాయం చేయండి.
– వేముల రాజవ్వ, రాపల్లి, గొల్లపల్లి
చిట్‌ఫండ్ డబ్బులు ఇప్పించండి
మాది గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లి. అక్షర చిట్‌ఫండ్ పేరిట జగిత్యాలలో బ్రాంచ్ తెరిచారు. చీటీలు, డిపాజిట్లు కట్టించుకున్నారు. చిటీ కాలపరిమితి ముగియగా.. డిపాజిట్‌గా మార్చామంటూ వడ్డీ ఆశచూపారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసే సమయానికి బ్రాంచి మూసేశారు. వరంగల్‌లోని హెడ్డాఫీసును సంప్రదిస్తే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. చిట్‌ఫండ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించండి.
కందుకూరి ఆదినారాయణ
కొడుకులు పట్టించుకుంట లేరు
మాది బుగ్గారం. ఆరో గ్యం సహకరిస్తలేదు. కొడుకులు శ్రీనివాస్, అంజయ్య పట్టించుకుంటలేరు. నాకున్న 20గుంటల భూమిని ఇద్దరికి స మానంగా పంచాను. ఇటీవల భార్య చనిపోయింది. ఆర్నెళ్లు పోషించిన పెద్ద కొడుకు ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అదే గ్రామంలో అద్దెకుంటున్న. పింఛన్ రూ.2వేలు మందులకు సరిపోవ డం లేదు. కొడుకులు పట్టించుకునేలా చూడండి.
– కొడిమ్యాల రాజయ్య, బుగ్గారం


