రివార్డు ఇప్పించండి
ప్రభుత్వ పిలుపు మేరకు తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన. రివార్డు ఇప్పటివరకు రాలేదు. ఆర్థిక ఇబ్బంది పడుతున్న. సొంత ఇల్లు కూడా లేదు. లొంగిపోయిన సమయంలో ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వ రివార్డులు ఇప్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా అందించడం లేదు.
– పసుల వసంత, మాజీ మావోయిస్టు, కోరుట్ల
కులబహిష్కరణ చేసిండ్రు
మాది ధర్మపురి మండలం దొంతాపూర్. ఎస్సీ నేతకాని కులానికి చెందిన నేను.. బీర్‌పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ఎస్టీ నాయకపు కులానికి చెందిన బర్ది పవన్‌ను 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న. పెళ్లయిన 15 రోజుల నుంచి కుల పెద్దలు కుల బహిష్కరణ పేరుతో కక్ష సాధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకపోతున్నం. కోమన్‌పల్లిలో ఉండొద్దంటూ హెచ్చరిస్తున్నాడు. ఎలాంటి శుభకార్యాలకు పిలడం లేదు. ఈ విషయమై గతంలోనూ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. కుల బహిష్కరణ పేరిట వేధిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి.
– పసుల సంగీత, పవన్ దంపతులు,
దొంతాపూర్ గ్రామం
రివార్డు ఇప్పించండి


