గతంలో నాలుగైదు రోజులకోసారి పొలానికి నీరు పెట్టేవాడిని. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో ప్రతిరోజూ నీరు పెట్టాల్సి వస్తోంది. దీంతో నీరు లోతుకు పడిపోతోంది. బావుల్లో తొందరగా నీరు ఊట రావడంలేదు.
– బద్దం లక్ష్మారెడ్డి, జోగిన్‌పల్లి, కోరుట్ల
నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేగానీ భూగర్భజలాలు పెరిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న నీటినే రైతులు పొలాలకు పొదుపుగా వాడాల్సిన అవసరం ఏర్పడింది.
– జి.నాగరాజు, భూగర్భజల వనరుల అధికారి, జగిత్యాల


