అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి● ఇన్‌చార్జి ఈవో రమాదేవి | - | Sakshi
Sakshi News home page

అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి● ఇన్‌చార్జి ఈవో రమాదేవి

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

అంజన్న ఆలయ అభివృద్ధికి కృషి● ఇన్‌చార్జి ఈవో రమాదేవి మల్యాల: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని ఇన్‌చార్జి ఈవో రమాదేవి అన్నారు. అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు గురువారం చల్లప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని పార్కింగ్‌, టికెట్ల బుకింగ్‌ కౌంటర్లు పరిశీలించారు. ఆలయ పరిచారికలుగా ఎంపికై న హరికృష్ణ ప్రసాద్‌, అరుణ్‌కుమార్‌, గోపికి నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఏఈవో హరిహరనాథ్‌, పర్యవేక్షకులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌, ప్రధాన అర్చకులు రంగయ్య, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల తనిఖీ

జగిత్యాలరూరల్‌: ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని బోర్డు అబ్జర్వర్‌ నరేంద్ర కుమార్‌ అన్నారు. బీర్‌పూర్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కేంద్రంలోని సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

మెట్‌పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయ 30వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. యజ్ఞ అర్చకులు నారబట్ల హరిప్రసాద్‌ చేతులమీదుగా గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామికి 108పాదుకలతో అభిషేకం చేశారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పా టు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూన గోవర్దన్‌, ఆలయ కమిటీ సభ్యులు గంగుల వివేక్‌, దొమ్మాటి ప్రవీణ్‌, అంకతి భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

జగిత్యాలరూరల్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే పంపించనున్నట్లు కరీంనగర్‌ డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శివాజీ తెలిపారు. ఈనెల 27న జరగనున్న స్వామివారి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలను దేవాదాయ శాఖ సహకారంతో పోస్టల్‌ శాఖ భక్తులకు అందిస్తోందన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు.. తమ ఇళ్ల వద్దనే ఉంటూ తలంబ్రాలు పొందేందుకు వీలుగా అన్ని పోస్టాఫీసులలో బుకింగ్‌ సదుపాయాన్ని తెచ్చామన్నారు. రూ.450 చెల్లించి ప్యాకేజీ బుక్‌ చేసుకున్న వారికి తలంబ్రాలు, ముత్యం, కుంకుమపు వ్వు, పటికబెల్లం, జీడిపప్పు ప్రసాదంగా అంది స్తామని, రూ.151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మాత్రమే అందుతాయని పేర్కొన్నా రు. ఈనెల 20లోపు సమీపంలోని పోస్టాఫీస్‌లో సంప్రదించి బుక్‌ చేసుకోవాలని సూ చించారు. శ్రీరాముడిభక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement