విరాసత్‌ చేస్తలేరు | - | Sakshi
Sakshi News home page

విరాసత్‌ చేస్తలేరు

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

మాది కోరుట్ల. బొమ్మెన శివారు సర్వే నంబర్‌ 59/2లో నా భర్త భూమాచారి పేరిట మూడెకరాలు ఉంది. నా భర్త 2019లో మరణించారు. కొందరు కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించుకుని వారి పేరిట పట్టా చేసుకోవాలని చూస్తున్నారు. నా భర్తకు వారసత్వంగా వచ్చిన భూమిని నా పేరిట విరాసత్‌ చేయాలని తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. విరాసత్‌ చేసేలా చూడండి.

– ఉరుమల్ల శ్యామల, కోరుట్ల

మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి

జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించండి. జిల్లాలో 31వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ప్ర స్తుతం పంట చేతికి వచ్చే సమయంలో బహిరంగా మా ర్కెట్‌లో వ్యాపారులు ధర తగ్గించి రైతులకు గిట్టుబాటు కాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆద్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలవాలి. గత ఖరీఫ్‌లో కథలాపూర్‌ మండలంలోని 300మంది రైతులకు ఆరు వేల క్వింటాళ్ల బకాయిలు ఇప్పించండి. – జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement