నాణ్యత దెబ్బతినకుండా చూస్తాం
తవ్వకంలో.. ఉడుకబెట్టడంలో.. పాలిషింగ్‌లో పసుపు నాణ్యత దెబ్బతినకుండా చూస్తున్నాం. ఇప్పుడు ఆధునిక యంత్రాలు రావడంతో పసుపు నాణ్యత పెద్దగా దెబ్బతినే అవకాశం లేదు. పసుపులో కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే రకాలు రావాల్సి ఉంది.
– రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్(మం)
తేమ ఉంటే రేటు రాదు
చాలామంది రైతులు బరువు వస్తుందనే నెపంతో పచ్చి పసుపును మార్కెట్‌కు తీసుకొస్తారు. తేమ ఉంటే పసుపునకు బూజు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి తేమ లేకుండా పసుపు కొమ్ములు విరగకుండా.. పాలిషింగ్ చేస్తే మార్కెట్‌లో అధిక ధర వస్తుంది.
– తిరుపతి, వ్యాపారి, జగిత్యాల
నాణ్యత దెబ్బతినకుండా చూస్తాం


