వైభవం.. వెంకన్న కల్యాణం
తిమ్మాపూర్: మండలంలోని ఎల్‌ఎండీకాలనీ ఆండాళ్, లక్ష్మీ సమేత వేకంటేశ్వరస్వామి ఆలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణాన్ని ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, శ్రీకాంతా శేషాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిరిజ ముత్యుంజయేశ్వరస్వామి ఆలయం తరఫున కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళా భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఒంటెల రవీందర్‌రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
వైభవం.. వెంకన్న కల్యాణం


