నృసింహుని బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
వెల్గటూర్: మండలంలోని కిషన్‌రావుపేటలోగల నాగపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు రావాలని మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. సర్పంచ్ కుమ్మరి సునీత, ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్, కోటిలింగాల ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, మాచర్ల రాజేందర్ పాల్గొన్నారు.
గంగమ్మతల్లికి మంత్రి పూజలు
ధర్మపురి: గోదావరి ఒడ్డున నిర్మించిన గంగమ్మతల్లికి మంత్రి పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం బోరు, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దోనూర్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


