కమనీయం.. రమణీయం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రమణీయం

Feb 23 2026 7:38 AM | Updated on Feb 23 2026 7:38 AM

కమనీయ

కమనీయం.. రమణీయం

రాయికల్‌: రాయికల్‌ మండలం భూపతిపూర్‌లో శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితులు గిరిధరాచార్యులు, అభిరామ్‌, హరికృష్ణ, వెంకటకృష్ణచార్యులు, వెంకటరమణ, రమణ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం రథోత్సవాన్ని పురవీధుల మీదుగా శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం భావన, ఉపసర్పంచ్‌ మూగల సంజీవచారి, మాజీ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ ఏనుగు ముత్యంరెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. స్వామివారిని ఎమ్మెల్సీ రమణ, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బోగ శ్రావణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

కమనీయం.. రమణీయం1
1/1

కమనీయం.. రమణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement