వృథాగా.. భగీరథ నీరు | - | Sakshi
Sakshi News home page

వృథాగా.. భగీరథ నీరు

Feb 23 2026 7:38 AM | Updated on Feb 23 2026 7:38 AM

వృథాగా.. భగీరథ నీరు

వృథాగా.. భగీరథ నీరు

వృథాగా.. భగీరథ నీరు

మెట్‌పల్లి: పట్టణ పరిధిలోని వెంకట్రావ్‌పేటలో జాతీయ రహదారి పక్కన మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ నుంచి వృథాగా పోతున్న నీరు ఇది. ఐదు రోజుల క్రితం పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడడంతో అక్కడి నుంచి భారీగా నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీలకు సోమవారం నుంచి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు.. 25 తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆరు నెలల్లో వెంకట్రావ్‌పేటలోనే మూడు, నాలుగు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. తరచుగా ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతుండడం.. వాటికి మరమ్మతులు చేపట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరోవైపు లీకేజీలతో కలుషిత నీరు సరఫరా కావడం, రోజుల తరబడి సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement