● సమీకృత మార్కెట్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు ● అమ్మకందారులకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

● సమీకృత మార్కెట్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు ● అమ్మకందారులకు ఇబ్బందులు

Mar 4 2026 7:46 AM | Updated on Mar 4 2026 7:46 AM

● సమీకృత మార్కెట్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు ● అమ్మకందారులకు ఇబ్బందులు ● సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి పట్టణంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌కు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ● మార్కెట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.6.50కోట్లు మంజూరు చేయగా.. 2021 జూన్‌లో ఇందుకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ● మూడేళ్ల క్రితం సంబంధిత కాంట్రాక్టర్‌ ఈ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగకపోవడం గమనార్హం. ● మార్కెట్‌ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడానికి బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణమని అధికారులు చెబుతున్నారు. ● గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఈ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంతవరకు వీటిపై దృష్టి సారించకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు పనుల పరిస్థితి నెలకొంది. ● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ● సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో కూరగాయల విక్రయదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ● ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలోనే రోడ్ల పక్కన కూరగాయలను విక్రయించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ● విక్రయదారుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. వారి కోసం అందుబాటులో పబ్లిక్‌ టాయిలెట్లు లేవు. ● ఇలా అనేక సమస్యలతో విక్రయదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

మెట్‌పల్లి: పట్టణంలో మాంసం, కూరగాయల విక్రయాలు ఒకే చోట జరిగేలా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాపారాలను వేర్వేరు ప్రదేశాల్లో ఎలాంటి వసతులు లేని చోట నిర్వహిస్తుండడం వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకే చోట అన్ని వసతులతో ఉండేలా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వీటిని మంజూరు చేసింది.

మెట్‌పల్లికి రూ.6.50కోట్లు మంజూరు..

బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం..

తప్పని ఇబ్బందులు

పనులు కావు..

సమస్యలు తీరవు

ఈ చిత్రం మెట్‌పల్లిలోని చావిడి మార్గంలో రోడ్డు పక్కన కూరగాయలు విక్రయాలు.

పట్టణంలో ప్రత్యేకంగా మార్కెట్‌ లేకపోవడంతో చావిడితోపాటు వెల్లుల్ల మార్గంలో

రోడ్డుకిరువైపులా ఇలా కూరగాయలు విక్రయిస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అసౌకర్యాల మధ్య అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఐదేళ్ల క్రితం ఖాదీ స్థలంలో సమీకృత మార్కెట్‌ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇంతవరకు ఆ పనులు పూర్తి కాలేదు. అది వినియోగంలోకి

వస్తే తమ ఇబ్బందులు తొలిగిపోతాయని భావిస్తున్న అమ్మకందారులకు

నిరాశే మిగులుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement