పేదల సొంతింటి కల తీరుతోంది
కథలాపూర్: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కథలాపూర్ మండలం ఊట్‌పెల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. సర్పంచ్ పాల లక్ష్మి, ఉపసర్పంచ్ ముదాం శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ వాకిటి రాజారెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
మేడిపల్లి: మేడిపల్లి రైతువేదికలో 39 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ మునిందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి, సర్పంచులు గుగ్గిళ్ల రమేష్, యాగండ్ల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


