ముదిరిన భూవివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ముదిరిన భూవివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం

Mar 4 2026 7:47 AM | Updated on Mar 4 2026 7:47 AM

ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారంలోని కాసార్లగడ్డలో ఇటీవల రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న కేతిరి లక్ష్మి, సారయ్య కుటుంబం స్థలాన్ని కబ్జా చేసిందని, వెంటనే ఖాళీ చేయాలని భూదాతలు, కొందరు పెద్దలు, ఓ సామాజిక వర్గం మధ్య నెలరోజులుగా వివాదం జరుగుతోంది. ఇదికాస్త ముదురి చివరికి దాడి చేసుకునే స్థాయికి చేరింది. సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఇందులో కేతిరి లక్ష్మి గాయాలయ్యాయి. అనేకఏళ్ల నుంచి నివాసం ఉంటున్న తమ ఇంటిని కూలగొట్టి, తమపై దాడి చేశారనే మనోవేదనతో ఆమె పురుగులమందు తాగింది. వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆత్మహత్యాయత్ననికి కారకులపై ఆమె భర్త సారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం నారాయణరెడ్డి, కుమార్‌, రాజయ్య, సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు. మరోవైపు.. ఎరుకుల కుటుంబం దాడి చేసిన, లక్ష్మి ఆత్మహత్యాయత్ననికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆర్ల సందీప్‌, కేవీపీఎస్‌ ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య డిమాండ్‌ చేశారు.

నలుగురిపై కేసు

నిందితులను అరెస్ట్‌ చేయాలి

కార్మిక సంఘూల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement