పేదలకు అండగా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

పేదలకు అండగా ప్రభుత్వం

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

● ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాలరూరల్‌: పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌కు చెందిన కొత్తపల్లి లింగం, ప్రణీత దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రణీతకు చీరను కానుకగా అందించారు. సర్పంచ్‌ శీలం సురేందర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌ రావు, ఉప సర్పంచ్‌ బాలే శ్రీనివాస్‌, ఎంపీఓ వాసవి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ ఆంక్షలు సడలించాలి

ఉపాధి హామీ పథకంపై విధించిన ఆంక్షలను సడలించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల అర్బన్‌ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులకు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రం తీరు సరికాదన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారుతాయన్నారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పీఆర్‌ ఏఈ విజయ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వినయ్‌, హౌసింగ్‌ ఏఈ భార్గవ్‌, సర్పంచులు మహేష్‌, గంగాధర్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ వినియోగించుకోవాలి

జగిత్యాల: సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పురాణిపేటకు చెందిన చిట్యాల జ్యోత్స్నకు మంజూరైన రూ.25వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది పేదలకు వరమని, ప్రతి ఒక్కరు దీనిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలె శంకర్‌, నవీన్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement