వైభవంగా రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రథోత్సవం

Mar 2 2026 8:18 AM | Updated on Mar 2 2026 8:18 AM

వైభవం

వైభవంగా రథోత్సవం

వెల్గటూర్‌: ఎండపల్లి మండలం కొండాపూర్‌లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్వామివారి రథం లాగారు. స్వామి దయతో నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌ తాటిపర్తి రాజమ్మ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు గురువారెడ్డి పాల్గొన్నారు.

మల్లన్నకు బోనాలు

కథలాపూర్‌: మండలంలోని చింతకుంటలో శ్రీమల్లికార్జునస్వామి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయం వరకు శోభాయాత్రగా వెళ్లారు. స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారుల నృత్యాలు అలరించాయి.

దాడులు సరికాదు

కోరుట్లటౌన్‌/మల్లాపూర్‌: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులు సరికాదని సీపీఐ జిల్లా నాయకుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షు డు సుతారి రాములు తెలిపారు. దాడులను తీ వ్రంగా ఖండించారు. ఒక దేశంపై మరో దేశం దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. సమస్యలుంటే సైనిక దాడులు కాకుండా దౌత్యపరమైన చర్యలు చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం శాంతి పరిరక్షణకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. శాంతిని నెలకొల్పడం, ప్రజల జీవన హక్కులు కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ప్రవాస భారతీయులు ఎవరూ ఆందోళన చెందవద్దని గల్ఫ్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెనుకుల అశోక్‌ అన్నారు. ఆదివారం వీవీరావుపేటలో గల్ఫ్‌ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడుల చేస్తున్నందున వలస కార్మికులు, ప్రవాస భారతీయుల రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు.

వైభవంగా రథోత్సవం1
1/1

వైభవంగా రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement