డబుల్‌బెడ్‌రూమ్ కాలనీలో సమస్యలు తెలుసుకున్న. సాక్షి యాజమాన్యం నన్ను స్టార్ రిపోర్టర్‌గా ప్రజల మధ్యకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడి సమస్యలు తెలుసుకున్న. తాగునీరు, వైకుంఠధామాలు లేక ఇబ్బందులు పడుతుండ్రు. పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యే కే.తారకరామారావు, కలెక్టర్ గరీమా అగ్రవాల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మున్సిపల్ నుంచి ప్రత్యేక దృష్టి సారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం కృషి చేస్తుంది. – జిందం కళ, మున్సిపల్ చైర్‌పర్సన్, సిరిసిల్ల


