కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కలెక్టరేట్ రోడ్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కిందపడిపోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం కలెక్టరేట్ రోడ్‌లో ఓ వ్యక్తి కిందపడిపోగా అతడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. వ్యక్తి వయసు సుమారు 55ఏళ్లకు పైగా ఉంటుందని, గుర్తు పట్టినవారు వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.


