● డీఎంహెచ్‌వో గుజ్జుల సుజాత
జగిత్యాల: మహిళాఆరోగ్యానికి 100 రోజుల హెల్త్ మిషన్ కార్యక్రమం చేపడుతున్నామని, 30 రకాల వైద్య పరీక్షలు చేసి ప్రతిఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇస్తామని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్ 100 పేరుతో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీ డయోగ్నోస్టిక్ హబ్ సెంటర్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రోగ నిర్ధారణ చేపడతామన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ సేవలు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో మెడిసిన్, గైనకాలజీ, పిడియాట్రిక్, కంటి, ఎముకలు, రెండో దశలో క్యాన్సర్, మూడో దశలో వడదెబ్బ, అతిసారం, నాలుగో దశలో ఫుడ్‌సేఫ్టీ మేళా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్, భూమేశ్వర్ పాల్గొన్నారు.


