కొడిమ్యాల: నాచుపల్లి జేఎన్టీయూలో సీఎస్పీ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 ఎస్సెన్షియల్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ అంశంపై గురువారం నుంచి మూడు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. ఎడ్యుటెక్ సంస్థకు చెందిన కల్యాణ్, శ్రీచరణ్ బృందం విద్యార్థులకు ఏఐ, ఐవోటీ, ఏడబ్ల్యూఎస్ వంటి ఆధునిక సాంకేతికలపై శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సీఎస్సీ హెచ్‌వోడీ చత్రపతి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


