విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

● ‘నవోదయ’ వార్షికోత్సవంలో ఎంపీ అర్వింద్‌

● ‘నవోదయ’ వార్షికోత్సవంలో ఎంపీ అర్వింద్‌

కోరుట్ల: నవోదయ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పట్టణంలోని నవోదయ విద్యాలయం మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచిస్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముందుగా ఎంపీ సంగెం రోడ్‌లో నవోదయ విద్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పసుపు బోర్డు చైర్మన్‌ గంగారెడ్డి, విద్యాలయ ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement