సాగునీరు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీరు విడుదల చేయాలి

Mar 9 2026 7:31 AM | Updated on Mar 9 2026 7:31 AM

కథలాపూర్‌(వేములవాడ): రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువ ద్వారా కథలాపూర్‌ మండలం భూషణ రావుపేట, కథలాపూర్‌ గ్రామాలకు నీరు విడుదల చేయాలని రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. రాళ్లవాగు ప్రాజెక్టులో పంటలకు సరిపడా నీళ్లున్నప్పటికీ కాలువల ద్వారా నీరు వదిలే విషయాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వరి పొట్టదశకు వచ్చిందని, కాలువలో చు క్కనీరు లేక పంటలు ఎండిపోయే ప్రమాదముందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి నీరు వదిలి పంటలను కాపాడాలని కోరారు. సర్పంచ్‌ బద్దం మహేందర్‌రెడ్డి, రైతు నాయకులు గడ్డం శేఖ ర్‌రెడ్డి, పూండ్ర జనార్ధన్‌రెడ్డి, పర్కుటపు గంగారెడ్డి, బోడ మాధవరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కూన శ్రీనివాస్‌, ఏలేటి రాజారెడ్డి, పూల్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement