ధర్మపురి: బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం శ్రీవేంకటేశ్వరస్వామికి దక్షిణ, ఉత్తర దిగ్యాత్రలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో శనివారం స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్‌నర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. దిగ్యాత్రల సందర్భంగా దేవస్థానం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అశ్వవాహనంపై శోభాయాత్రగా తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి స్వామివార్లను ఆశీనులు చేసి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తర దిగ్యాత్ర సందర్భంగా స్థానిక ఉసిరికవాగు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


