సానుకూల దృక్పథం అవసరం
– కోయ శ్రీహర్ష, ఐఏఎస్, కలెక్టర్, పెద్దపల్లి
సాక్షి,పెద్దపల్లి: సిలబస్‌పై అవగాహన, ప్రణాళికతో మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ఒక్కో పరీక్ష ద్వారా వడపోత జరిపి ఎక్కువ అవగాహన, తెలివితేటలున్న వారిని ఎంపిక చేస్తారు. సివిల్స్‌కు సన్నద్ధం అయ్యేవాళ్లు సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మాక్‌టెస్టులు రాస్తుండాలి. గతంలో వచ్చిన పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. షెడ్యూల్ ఫాలో అవుతూ, నోట్స్ మెయింటైన్ చేస్తూ, సమాజంలో జరిగే ప్రతి విషయంలో అనాలసిస్ చేయాలి. సిలబస్ పుస్తకాలు..ఆన్‌లైన్‌లో దొరికే మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. పత్రికలు, విజేతల నోట్స్ చదవాలి. కోచింగ్ తీసుకున్నవారే ఉద్యోగాలు సాధిస్తారనేది అపోహే. కోచింగ్ గెలుపు సూత్రమేమి కాదు. సివిల్స్ క్రాక్ చేయటంలో ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం. రోజూ 2–3 ఆన్సర్లు రాసి, టైమ్‌లో (7–9 నిమిషాలు/ప్రశ్న) పూర్తి చేయండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి, ఇది మార్కులు పెంచుతుంది. ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్, హంబుల్‌గా ఉండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, తెలియకపోతే ‘సార్, నాకు తెలియదు’ అని చెప్పాలి. హైదరాబాద్‌లో సైతం మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. పట్టుదల, కన్సిస్టెన్సీతో రెగ్యులర్ ప్రాక్టీస్, స్ట్రాంగ్ బేసిక్స్, మెంటల్ స్ట్రెంత్, బ్యాలెన్స్‌డ్ లైఫ్‌తో ఎవరైనా యూపీఎస్‌సీ సాధించవచ్చు.


