సన్నవడ్ల బోనస్‌ ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

సన్నవడ్ల బోనస్‌ ఇప్పించండి

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

 సన్న

సన్నవడ్ల బోనస్‌ ఇప్పించండి

మాది బుగ్గారం మండలం మద్దునూర్‌. 2024– 25 యాసంగిలో గ్రామ రైతులందరం ప్రభుత్వానికి సన్న వడ్లు విక్రయించినం. ప్రభుత్వం ఇస్తానన్న బోనస్‌ ఇప్పటివరకు మా ఖాతాల్లో జమచేయలేదు. బోనస్‌ వెంటనే ఇప్పించండి.

– మద్దునూర్‌ గ్రామ రైతులు

భూమిలోకి పోనివట్లేదు

సూరంపేట శివారు సర్వేనంబర్‌ 167/21లో 1.38 ఎకరాల భూమిని నా భర్త బానాల ఎల్లయ్యకు ప్రభుత్వం 40 ఏళ్ల క్రితం ఇచ్చింది. ఆయన మరణానంతరం నా పేరిట మార్పిడి చేయించుకున్న. ఇటీవల కొందరు ఆ భూమి తమదంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సాగుచేసుకోకుండా అడ్డుకుంటున్నారు. విచారణ జరిపి భూమికి హద్దులు పెట్టాలని కొడిమ్యాల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన. ఆ భూమికి సంబంధించిన రికార్డులు లేవని, సబ్‌డివిజన్‌ రికార్డు అందుబాటులో లేనందున కొలతలు వేయలేమని తహసీల్దార్‌ నివేదిక ఇచ్చారు. ఆ భూమిలోకి వెళ్లవద్దంటూ స్వయంగా తహసీల్దారే ఆంక్షలు విధిస్తున్నారు. మోకాపై విచారణ చేపట్టి న్యాయం చేయండి. – బానాల ఎల్లవ్వ,

సూరంపేట, కొడిమ్యాల మండలం

 సన్నవడ్ల బోనస్‌ ఇప్పించండి
1
1/1

సన్నవడ్ల బోనస్‌ ఇప్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement