అక్కకు స్వీట్‌ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా.. | Young Man Dies Tragically In Moosapet Road Accident | Sakshi
Sakshi News home page

అక్కకు స్వీట్‌ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా..

Jun 12 2026 11:20 AM | Updated on Jun 12 2026 5:50 PM

Young Man Dies Tragically In Moosapet Road Accident

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మూసాపేట: కొత్త ఫోన్‌ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కూకట్‌పల్లి  పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన రాజేష్‌ (30) ఇందిరానగర్‌లో నివాసముంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం కొత్త మొబైల్‌ ఫోన్‌ కొనడంతో మూసాపేటలో ఉన్న తన అక్కకు  స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి  బైక్‌పై అర్ధరాత్రి బయలుదేరాడు. ఐడీఎల్‌ చెరువు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా  వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిబ్రవరి నెల నుంచి రాజేష్‌ శివమాలలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement