అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Tragedy Incident in Anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 27 2026 3:43 PM | Updated on Apr 27 2026 3:56 PM

Tragedy Incident in Anakapalli

సాక్షి,నక్కలపల్లి: అనకాపల్లి జిల్లా నక్కల పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలపై ఏథర్‌ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయాపడ్డారు.

అప్రమత్తమైన స్థానికులు వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచండంతో ఓ మహిళను అనకాపల్లికి చెందిన ఓ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.    

నక్కపల్లి వైపు నుండి అడ్డురోడ్డు వైపు మహిళా కూలీలు నడుస్తూ వెళ్తుండగా.. వారి వెనక నుంచి ఏథర్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement