వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి | Five people died in separate accidents in Prakasam district | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

Jun 23 2026 4:23 AM | Updated on Jun 23 2026 4:23 AM

Five people died in separate accidents in Prakasam district

లారీని ఆటో ఢీకొని ముగ్గురు..

బైక్‌ అదుపు తప్పి ఒకరు.. 

ఆటో–బైక్‌ ఢీకొని మరొకరు మృతి

సంతమాగులూరు (అద్దంకి): ప్రకాశం జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురికి గాయాల­య్యాయి. అందరూ పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వారు. మృతుల్లో దావులూరి ఏడుకొండలు (50), ముండ్రు రవణమ్మ (52) అక్కడికక్కడే మృతిచెందగా, ఎలవర్తి సుబ్బులు (70) నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయింది. తీవ్రగాయాలైన బోయపాటి అనూ­రాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ చికిత్స పొందుతున్నారు. డి.చిన్న యోగమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సంతమాగులూరు ఎస్‌ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

రాళ్లగుట్టలపైకి దూసుకెళ్లి.. 
మర్రిపూడి మండలం రాజుపాలెం సమీపంలో రాళ్ల గుట్టలపైకి బైక్‌ దూసుకెళ్లిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన గ్రానైట్‌ క్వారీ డంపింగ్‌ ఆపరేటర్‌ చిన్న బసప్ప (51) మృతి చెందాడు. బసప్ప తన స్నేహితుడు పాప­త్తు బల్లూరెడ్డితో కలిసి కనిగిరి మండలం ఎనిమిరెడ్డిపల్లి­లో జరిగిన పోలేరమ్మ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొని తి­రిగి వస్తూ రాజుపాలెం సమీపంలోని హైవేపై ఉన్న రా­ళ్ల గుట్టలను గమనించకుండా బైక్‌ నడపడంతో అదుప­#తప్పింది. ఈ ఘటనలో చిన్న బసప్ప అక్కడిక­క్క­డే మృతి చెందగా.. తీవ్రగాయాలైన బల్లూరెడ్డిని ఒంగో­లు జీజీహెచ్‌కి తరలించారు. మరోవైపు ఆటో, ద్విచ­క్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మ«­ద్య­ప్రదేశ్‌కు చెందిన దయాకర్‌ జైస్వాల్‌ (44) మృతి చెందిన ఘటన మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీ సిద్దారెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement