నిజామాబాద్: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ | Lorry Hits RTC Bus In Nizamabad District | Sakshi
Sakshi News home page

నిజామాబాద్: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

Mar 24 2026 12:50 PM | Updated on Mar 24 2026 1:13 PM

Lorry Hits RTC Bus In Nizamabad District

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బోధన్‌-బాన్సువాడ ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

వారిలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ సీరియస్‌గా ఉండడంతో నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. ఘటన స్థలంలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement