భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఈనెల 11న మృతిచెందిన తాపీమేస్త్రీ ఎస్‌కే జాఫర్ కేసు మిస్టరీ వీడింది. భార్య ఖతిజా, ఆమె ప్రియుడు షేక్ మీరాసాహెబ్ కలిసి హతమార్చిన ట్లు పోలీసులు నిర్ధారించా రు. ఈ మేరకు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐ శివరామ కృష్ణ వివరాలు వెల్లడించారు.
ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాకు తిప్పనపల్లికి చెందిన జాఫర్‌తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల పాటు కాపురం సజా వుగా సాగింది. ఆ తర్వాత జీవనోపాధి నిమిత్తం చింతలపూడి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాసాహెబ్‌తో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానం వచ్చిన జాఫర్ భార్యాపిల్లలతో తిరిగి తిప్పనపల్లికి వచ్చినా.. వారి మధ్య ఫోన్ సంభాషణ, వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉన్నాయి.
దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఖతిజా మీరాసాహెబ్‌తో కలిసి భర్తను హతమార్చగా, సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు ఈనెల 12న మృతదేహాన్ని ఖననంచేశారు. ఆరోజు రాత్రి మృతుడి కూతరు కుటుంబీకులకు అసలు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు శవ పరీక్ష చేశారు. కేసు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.


