మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ళుమరి సమీపంలోని త్రిమూర్తి ఆగ్రో ఫార్మ్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనలో క్యాంపురం గ్రామానికి చెందిన ఆది (30), మహేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు టిల్లు (24) తీవ్ర గాయాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు.
ఈ ప్రమాదంతో మడకశిర ప్రాంతంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ, గాయపడిన యువకుడి ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


