Madhapur: మైండ్‌స్పేస్‌ వద్ద ఘోరప్రమాదం  | Road Accident In Madhapur | Sakshi
Sakshi News home page

Madhapur: మైండ్‌స్పేస్‌ వద్ద ఘోరప్రమాదం 

Apr 6 2026 10:29 AM | Updated on Apr 6 2026 10:29 AM

Road Accident In Madhapur

హైదరాబాద్‌: మాదాపూర్‌ మైండ్‌స్పేస్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచి్చన ఓ డీసీఎం డ్రైవర్‌ స్కూటీపై వెళుతున్న దంపతులను ఢీకొట్టాడు. అనంతరం స్కూటీని జూబ్లీహిల్స్‌ (దాదాపు ఐదు కిలోమీటర్లు) వరకు డీసీఎం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయపడ్డాడు.  శనివారం అర్థరాత్రి  రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన మేరకు.. మహేశ్వరంలో నివాసముంటున్న అబ్దుల్‌ బాసిత్‌ (26), అతని భార్య హనియా అయేషా (22)లు కూకట్‌పల్లిలో సినిమా చూసి శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మాదాపూర్‌ మైండ్‌స్పేస్‌ వద్ద ఓ డీసీఎం అతివేగంగా వచ్చి వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో అయేషా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే  అసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. భర్త అబ్దుల్‌ బాసిత్‌కుగాయాలయ్యాయి. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం కింద ద్విచక్రవాహనం ఇరుక్కుపోయిన విషయాన్ని డ్రైవరు గమనించకుండా 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కొందరు గిగ్‌ వర్కర్లు గమనించి డీసీఎంను ఆపడంతో డ్రైవర్‌ పరారయ్యాడు. డ్రైవర్‌ సహాయకుడు పట్టుబడటంతో అతనికి దేహశుద్ధి చేశారు. చూస్తే డ్రైవర్‌ అసలు స్పృహలో ఉన్నాడా, లేడా అని  అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డీసీఎం, ద్విచక్రవాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement