కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan Condolence To Kurnool Road Accident | Sakshi
Sakshi News home page

కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Apr 16 2026 8:32 AM | Updated on Apr 16 2026 10:33 AM

YS Jagan Condolence To Kurnool Road Accident

సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం మరో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement