రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్‌ మృతి | Deputy Sarpanch Dies in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్‌ మృతి

May 28 2026 8:08 AM | Updated on May 28 2026 12:17 PM

Deputy Sarpanch Dies in Road Accident

సుల్తానాబాద్‌రూరల్‌/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్‌ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్‌ కోట నిరంజన్‌రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ కోట నిరంజన్‌రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్‌కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్‌ ఎక్కగా నిరంజన్‌రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.  

పోలీసుల అదుపులో లారీ డ్రైవర్‌ 
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్‌ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్‌ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement