ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి | Karnataka high court reduces driver's jail term to 1 day | Sakshi
Sakshi News home page

ఏడాది జైలుశిక్ష.. ఒక్కరోజుతో సరి

May 24 2026 1:16 PM | Updated on May 24 2026 3:23 PM

Karnataka high court reduces driver's jail term to 1 day

బెంగళూరు: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్‌ అహ్మద్‌ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిïÙటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్‌ గాయపడి, చేతికి రాడ్‌ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్‌ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్‌ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే,  సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement