శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి | Serious road accident in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

Apr 13 2026 7:19 AM | Updated on Apr 13 2026 8:41 AM

Serious road accident in Uttar Pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్, హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు వెళుతున్న బస్సు, ట్రక్కు వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. దీంతో గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement