రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం | DCPs daughter dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె దుర్మరణం

Aug 10 2026 5:42 AM | Updated on Aug 10 2026 5:42 AM

DCPs daughter dies in road accident

విజయవాడ నుంచి చీరాల బీచ్‌కి కారులో వెళ్తుండగా ఘటన  

గుంటూరు రూరల్‌: గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్‌ వద్ద హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షేక్‌ షిరీన్‌బేగం కుమార్తె అఫీఫా(24) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గా­యపడ్డారు. అఫీఫా తాడేపల్లిలో జిమ్‌కు వెళుతుంటా­రు. జిమ్‌ యజమాని రుతి్వక్, రోజూ జిమ్‌కు వచ్చే వంశీ, సుదీర్, అవినాష్ లు ఆమెకు స్నేహితులయ్యారు. వీరు ఆదివారం చీరాల బీచ్‌కి వెళ్లేందుకు విజయవాడ నుంచి కారులో బయలుదేరారు. ఏటుకూరు బైపాస్‌ వద్ద హైవేలో వెళుతుండగా ముందువెళుతున్న ప్రభుత్వ పౌరసరఫరాలశాఖ రేషన్‌ తరలించే లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని, డివైడర్‌ను ఢీకొంది. 

కారు డ్రైవ్‌ చే­సు­్తన్న అవినాష్, సుధీర్, వంశీ, రుత్విక్‌లు గాయపడ్డారు. కారు వెనుక సీట్లో కూర్చున్న అఫీఫా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి, గాయపడినవారిని హైవేలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న డీసీపీ షిరీన్‌.. తన కుమార్తె మరణించిందన్న విషయం తెలిసి స్పృహ కో­ల్పోయా­రు. ఆమెకు వైద్యు­లు చికి­త్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అఫీఫా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నల్లపాడు సీఐ భాస్కర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అత్యంత బాధాకరం: మాజీ సీఎం జగన్‌ 
సాక్షి, అమరావతి: విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం కుమార్తె అఫీఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు ఏటుకూరు బైపాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుమార్తెను కోల్పోయిన షిరీన్‌ బేగం, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement