ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్
కర్నూలు (టౌన్): మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డీనేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం కర్నూలులో తలశిల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం తాడేపల్లి నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సబ్‌జైలుకు వెళ్లి విరూపాక్షిని పరామర్శిస్తారని వెల్లడించారు.


