భార్యను హత్యచేసిన భర్త | Husband assassinated his wife | Sakshi
Sakshi News home page

భార్యను హత్యచేసిన భర్త

Aug 10 2026 5:30 AM | Updated on Aug 10 2026 5:30 AM

Husband assassinated his wife

ఆపై తానూ ఆత్మహత్య

రాజానగరం: తూర్పుగో­దా­వరి జిల్లా రాజా­నగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్య­గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్‌ చేశాడు. ఎంతకీ ఫోన్‌ తీయక­పోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.

రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరు­కుని, వారి మరణానికి గల కారణాలను తెలుసు­కునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణా­లను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసు­కున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటు­న్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేక­పోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడి­యోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్‌  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement