ఘోర రోడ్డు ‍ప్రమాదం.. 10 మంది మృతి | 10 killed as van collides head on with truck | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ‍ప్రమాదం.. 10 మంది మృతి

May 18 2026 2:50 PM | Updated on May 18 2026 3:42 PM

10 killed as van collides head on with truck

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లిఖింపూర్‌లో  ఈ రోజు( సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిసైయా-లఖింపూర్ జాతీయ రహదారిపై  వ్యాన్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.  దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

లిఖింపూర్‌ నుండి వ్యాన్‌  సిసైయా వైపు వ్యాన్ వెళ్తుండగా ఉంచ్‌గావ్‌, భరేహతా గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మరో తొమ్మిదిమంది అక్కడికక్కడే ‍ప్రాణాలు విడిచినట్లు పేర్కొన్నారు. కాగా మరణించిన వారిలో ఏడుగురిని ఇదివరకే గుర్తించామని మరో ముగ్గురిని గుర్తించే అవకాశం ఉందని తెలిపారు.

కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం, గుండెల్ని పిండేసే ఘటన. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.  మరణించిన వారి ఆత్మలకు ఆ శ్రీరాముడు తన దివ్య చరణాల చెంత స్థానం కల్పించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఆ  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సైతం ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement