తుంగభద్రలో మునిగి నలుగురు కర్ణాటక వాసులు మృతి
కర్ణాటక: ఈత సరదా పెళ్లింట్లో విషాదం నింపింది. తుంగభద్ర నదిలో గల్లంతై నలుగురు కర్ణాటక వాసులు మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కందుకూరులో చోటు చేసుకుంది. వివరాలివీ.. కందుకూరు గ్రామంలో దాసరి తిరుపతయ్య కుమారుడు ఆదిశేషులు వివాహం ఈ నెల 26న నిర్వహించారు. శుక్రవారం తిరుగు పెళ్లి చేసి వెళ్లాలని బంధువులు ఇక్కడే ఉండిపోయారు.
మధ్యాహ్నం సమయంలో తుంగభద్ర నదిలో స్నానానికని బంధువులు దాదాపు 15 మంది గ్రామ శివారులోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్ట వద్ద తుంగభద్ర నదికి వెళ్లారు. ఆ సమయంలో దాసరి రత్నమ్మ(26) కాలు జారి నదిలోకి పడి పోయింది. కాపాడేందుకు ఆమె అక్క దాసరి ఉమావతి అలియాస్ సంగీత (28), దాసరి శివానంద (20), దాసరి మహంతే‹Ù(20) నదిలోకి దూకి గల్లంతయ్యారు. బంధువులంతా గాలించగా చివరకు మృతదేహాలై కనిపించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


